దుర్గాఘాట్‌లో పుణ్య స్నానాలకు అనుమతి | Sakshi
Sakshi News home page

దుర్గాఘాట్‌లో పుణ్య స్నానాలకు అనుమతి

Published Tue, Nov 21 2023 1:28 AM

- - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గాఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సోమవారం నుంచి భక్తులను అనుమతించారు. తెల్లవారుజామున పవిత్ర దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ఆలయ వైదిక కమిటీ సభ్యులు మారుతీ యజ్ఞనారాయణ శర్మ పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, పూజా సామగ్రిని సమర్పించారు. తొలుత ఆలయ స్థానాచార్య, అర్చకులు కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఘాట్‌లోకి స్నానాలు చేసేందుకు భక్తులను అనుమతించారు. కార్తీక మాసం నుంచి నదిలోకి దిగి పుణ్యస్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి పాలక మండలి సభ్యులు, చైర్మన్‌ కర్నాటి రాంబాబు పాలక మండలి సమావేశంలో తీర్మానించారు. గత రెండు నెలలుగా స్నానఘాట్‌లో పూడిక తీత పనులు చేపట్టారు. కార్తిక మాసం తొలి సోమవారం నేపథ్యంలో భక్తులను నదిలోకి స్నానాలకు అనుమతించామని ఈఈ ఎల్‌. రమాదేవి పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement