నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం

Oct 14 2026 12:35 AM | Updated on Oct 14 2026 12:35 AM

మోపాల్‌: నర్సింగ్‌ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు బీఎస్సీ, జీఎన్‌ఎం కోర్సుల్లో ప్రవేశా లకు ఆహ్వానిస్తున్నట్లు ఏవీఎస్‌ వెల్‌నెస్‌ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్లు తాళ్ల సుమన్‌గౌడ్‌, మహ్మద్‌ అసద్‌ ఖాన్‌, తూర్పు వివేకానందరెడ్డి అన్నారు. ఈమేరకు మోపాల్‌లో నూతనంగా వెల్‌నెస్‌ నర్సింగ్‌ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడా రు. బీఎస్సీ నర్సింగ్‌లో 50, జీఎన్‌ఎంలో 60 సీట్లు ఉన్నాయన్నారు. తెలంగాణలోని జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రకు చెందిన అర్హత కలిగిన బాలబాలికలు నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు మోపాల్‌లోని కళాశాల కార్యాలయాన్ని సందర్శించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement