New Delhi Municipal Council Removes BRS Party Flexis - Sakshi
Sakshi News home page

ఢిల్లీ: పార్టీ కార్యాలయం ప్రారంభ వేళ.. బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీల తొలగింపు

Dec 13 2022 10:37 AM | Updated on Dec 13 2022 11:38 AM

NDMC Removes BRS Flexis - Sakshi

భారత రాష్ట్ర సమితికి ఆదిలోనే చిన్నపాటి షాక్‌ తగిలింది. 

ఢిల్లీ: భారత రాష్ట్ర సమితికి ఆదిలోనే షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ కార్యాలయం ముందు ఫ్లెక్సీలను తొలగించింది న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయం ఎదుట అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్తూ..  అధికారులు మంగళవారం వాటిని తొలగించారు. 

ఎన్డీఎంసీ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంపై గులాబీ పార్టీ శ్రేణులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం హస్తినకు చేరుకున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ యాగాల్లో పాల్గొననున్నారు.  ఈ నెల 14న బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది.

తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం లక్ష్యంగా భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)ని  ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement