బెంగళూరు: మండ్యలో మహిళా ఎస్ఐ సవితా పాటిల్‌కి చెంపదెబ్బ కొట్టిన కేసులో తుమకూరు రూరల్ ఎమ్మెల్యే సురేష్‌గౌడ కుమార్తె ఐశ్వర్య బేషరతుగా క్షమాపణ చెప్పింది. ఆగస్టు 12న ఆమె స్థానిక ఆలయంలో దర్శనం కోసం రాగా, ఎస్ఐ సవితా నిలిపేయడంతో గొడవ జరిగి చెంపమీద కొట్టడం, తిరిగి ఎస్ఐ ఆమెను చెంప దెబ్బ కొట్టడం తెలిసిందే. ఇరువురూ కేసులు కూడా పెట్టుకున్నారు. ఎస్ఐ క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ, కోర్టులో కూడా కేసు వేశారు. ఐశ్వర్య బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, జడ్జి అంగీకరించలేదు. మీరు క్షమాపణలు చెప్పాలని ఆదేశించడంతో ఈ మేరకు ఐశ్వర్య ఓ వీడియోలో క్షమాపణలు కోరింది.
ఇదీ చదవండి: Gachibowli: క్యాబ్ ఎక్కుతుండగా... ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు


