లిక్కర్‌ స్కామ్‌ కేసు.. ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ మళ్లీ డుమ్మా

Kejriwal Skips Ed Enquiry Sixth Time - Sakshi

ఢిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వరుసగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)విచారణకు గైర్హాజరయ్యారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ ఆరోసారి పంపిన సమన్లకు కేజ్రీవాల్‌ స్పందించలేదు.

లిక్కర్‌ స్కామ్‌ కేసులో సోమవారం తమ ముందు విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈ నెల 14న ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. కేజ్రీవాల్‌ విచారణకు హాజరు కాకపోవడంపై ఆప్‌ స్పందించింది. ఈడీ పంపిన సమన్లు చట్టవిరుద్ధం అని పేర్కొంది.

‘కేజ్రీవాల్‌ విచారణకు రాకపోవడంపై ఈడీ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. మళ్లీ మళ్లీ సమన్లు పంపకుండా కోర్టు నిర్ణయం వచ్చేవరకు వేచి చూడాలి’ అని ఈడీకి ఆప్‌ నేతలు సూచించారు.  

ఇదీ చదవండి.. జేకేలోనూ ఇండియా కూటమికి ఎదురుదెబ్బ

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top