‘భావి ప్రధాని అఖిలేష్‌’ | Future prime minister akhilesh | Sakshi
Sakshi News home page

‘భావి ప్రధాని అఖిలేష్‌’

Jul 1 2024 11:19 AM | Updated on Jul 1 2024 1:11 PM

Future prime minister akhilesh

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ పుట్టిన రోజు నేడు(జూలై 1). ఈ సందర్భంగా యూపీలోని పార్టీ నేతలు, కార్యకర్తలు అఖిలేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే వారు కేక్‌లను తీసుకువచ్చి అఖిలేష్‌ చేత కట్‌ చేయిస్తున్నారు. అయితే లక్నోలోని పార్టీ కార్యాలయం బయట వెలిసిన పోస్టర్‌ చర్చనీయాంశంగా మారింది.

ఆ పోస్టర్‌లో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ భావి ప్రధాని అని రాశారు. దీనిని చూసిన వారంతా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. మరోవైపు యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తాజాగా అఖిలేష్‌కు తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ నేత పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో గల మంచముఖ హనుమాన్‌ మందిరంలో అఖిలేష్‌కు దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అనంతం ఆలయానికి వచ్చినవారందరికీ ప్రసాదం పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement