సిక్కింలో మంచులో చిక్కిన 900 మంది యాత్రికులు | Around 900 tourists stranded in Sikkim due to heavy snowfall | Sakshi
Sakshi News home page

సిక్కింలో మంచులో చిక్కిన 900 మంది యాత్రికులు

Mar 12 2023 5:21 AM | Updated on Mar 12 2023 8:24 AM

Around 900 tourists stranded in Sikkim due to heavy snowfall - Sakshi

గ్యాంగ్‌టాక్‌: సిక్కింలో పర్యాటకులు తీవ్రమైన మంచులో చిక్కుకున్నారు. నాథులా, టోంగో లేక్‌ నుంచి రాజధాని గ్యాంగ్‌టాక్‌ వైపు శనివారం సాయంత్రం బయలుదేరిన 89 వాహనాలు దట్టమైన మంచులో చిక్కినట్టు అధికారులు చెప్పారు.

వీటిలో సుమారు 900 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారన్నారు. ఆర్మీ సాయంతో వీరిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. అడ్డంకులను తొలగిస్తుండటంతో ఇప్పటికే 15 వాహనాలు గ్యాంగ్‌టాక్‌ వైపు బయలుదేరాయని చెప్పారు. కొందరు ప్రయాణికులను దగ్గరల్లోని క్యాంపులకు తీసుకెళ్తామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement