పారదర్శకంగా ‘డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ‘డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

Published Tue, Mar 28 2023 1:00 AM

వీసీలో అధికారులతో మాట్లాడుతున్న 
కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ - Sakshi

కందనూలు: నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద కేటాయించనున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ఇళ్ల లబ్ధిదారుల ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా చేయాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడారు. ఒక్కో మున్సిపాలిటీలో దాదాపు 400 నుంచి 500 వరకు దరఖాస్తులు రాగా, ముందుగా వార్డుల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారుల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న, గుడిసె లేదా అద్దె ఏ ఇళ్లల్లో ఉన్నారు, అలాగే ఇదివరకు ఇందిరమ్మ ఇల్లు, మరే ఇతర గృహ పథకంలో లబ్ధి పొందారా లేదా రూడీ చేసుకోవాలన్నారు. ఈమేరకు కచ్చితమైన నివేదిక తయారు చేసి వార్డుసభ ద్వారా తీర్మానం చేయాలని, కమిటీ ద్వారా రూపొందించిన జాబితాను రెవెన్యూ అధికారులు వెరిఫై చేయాల్సి ఉంటుందని చెప్పారు. మంగళవారం సాయంత్రం వరకు 80 శాతం టేబుల్‌ వ ర్క్‌ పూర్తి కావాలని, అలాగే రిజర్వేషన్‌ తప్పకుండా అమలు చేయాలన్నారు. వీసీలో ఆదనవు కలెక్టర్లు మనూచౌదరి, మోతిలాల్‌, ఆర్డీఓలు పాల్గొన్నారు.

దరఖాస్తుకు నేడు ఆఖరు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకోడానికి ఈ నెల 27 చివరి తేదీ కాగా లబ్ధిదారుల విజ్ఞప్తి మేరకు మంగళవారం వరకు గడువు పొడగిస్తున్నట్లు కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కల్వకుర్తి, అచ్చంపేట, పెద్దముద్దునూర్‌లో ఇళ్ల కేటాయింపుపై మార్చి 27న చివరి తేదీగా నిర్దేశించటం జరిగిందని, దీనిని ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు, పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

కల్వకుర్తి టౌన్‌/కల్వకుర్తి: మున్సిపాలిటీలలో ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను అన్వేషించాలని, ఆదాయం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయ సమావేశ మందిరంలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ముందుగా కమిషనర్‌ ఆశ్రిత్‌కుమార్‌ బడ్జెట్‌ను చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీలో నూతనంగా విలీనమైన గ్రామాలతోపాటు, నూతనంగా ఏర్పాటైన కాలనీలలో మౌలికవసతుల కల్పనపై, ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి సారించాలని అన్నారు. అనంతరం చైర్మన్‌ సత్యం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి సమన్వయంతో కృషిచేస్తామని, శ్మశానవాటికకు 3 ఎకరాల స్థలం అవసరమని అన్నారు. ఇదిలాఉండగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.44.33కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ షాహెద్‌, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.

ఆదాయం ఉంటేనే అభివృద్ధి సాధ్యం

Advertisement
Advertisement