మోడికుంటను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు | Sakshi
Sakshi News home page

మోడికుంటను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు

Published Fri, Apr 19 2024 1:35 AM

మాట్లాడుతున్న రవికుమార్‌ - Sakshi

వాజేడు: మోడికుంట ప్రాజెక్టును పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ అన్నారు. మండల పరిధిలోని పూసూరు రిసార్ట్స్‌లో పార్టీ నాయకులు దావూద్‌ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాజేడు మండల పరిధిలోని కృష్ణాపురం సమీపంలో మంజూరైన మోడికుంట ప్రాజెక్టును పూర్తి చేస్తే సాగు, తాగు నీరు అందుతుందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే సాగునీరు కీలకమన్నారు. 2006 నుంచి మోడికుంట ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధులను మంజూరు చేయించి అనుమతులు లేవని కాలయాపన చేసిందని ఆరోపించారు. 2016లో అనుమతులు వచ్చినప్పటికీ ప్రజల అభిప్రాయ సేకరణ చేసి ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తలేదన్నారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే 36 గ్రామాలకు తాగునీరు, 25 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి రావు, భీరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్‌, వాసు, చిట్టిబాబు, శ్రీను, రాములు, ఆగిరెడ్డి, రాజేష్‌, చిరంజీవి, చిన్నా పాల్గొన్నారు.

Advertisement
Advertisement