మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు

Published Thu, Nov 16 2023 1:32 AM

గ్రామస్తులతో మాట్లాడుతున్న సీఐ కిరణ్‌కుమార్‌   - Sakshi

మహదేవపూర్‌: మావోయిస్టులకు సహకరించొద్దని మహదేవపూర్‌ సీఐ కిరణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం పెద్దంపేట గ్రామంలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సోషల్‌మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. మావో యిస్టుల గురించి ఎలాంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గ్రామంలో గుడుంబా, గంజాయి, సార వంటి నిషేధిత వస్తువులు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజ్‌కుమార్‌, సివిల్‌, సీఆర్‌పీఎఫ్‌ ిసిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement