Rashmika Mandanna: గుడ్‌ న్యూస్‌ చెప్పిన రష్మిక | Rashmika Mandanna To Act In Salman Khan,AR Murugadoss Film Sikandar | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: బాలీవుడ్‌లో మరో బంపరాఫర్‌ కొట్టేసిన రష్మిక

May 9 2024 2:01 PM | Updated on May 11 2024 4:27 PM

Rashmika Mandanna To Act In Salman Khan,AR Murugadoss Film Sikandar

‘పుష్ప’ చిత్రంలో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక. ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్‌ పైనే పెట్టింది. మిషన్‌ మజ్ను, గుడ్‌బై లాంటి బాలీవుడ్‌ సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ యానిమల్‌ మూవీ రష్మికకు పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. అందులో ప్రేమతో హింసించే భర్తకు భార్యగా రష్మిక అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. 

యానిమల్‌ తర్వాత రష్మికకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది ఈ నేషనల్‌ క్రష్‌. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.

‘మీరు ఎన్నో రోజులుగా నా సినిమా అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకోసమే ఈ సర్‌ప్రైజ్‌. ‘సికందర్‌’తో  మీ ముందుకు వస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని రష్మిక తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో రాసుకొచ్చింది. 

ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్‌ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.  సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ‘కుబేర’, ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన పుష్ప 2 చిత్రం ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement