కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్‌.. ఫోటో వైరల్‌ | Prabhas Enters 'Kannappa' Movie Set | Sakshi
Sakshi News home page

కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్‌.. ఫోటో వైరల్‌

May 9 2024 5:05 PM | Updated on May 9 2024 5:15 PM

Prabhas Enters 'Kannappa' Movie Set

మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్‌బాబు, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్‌ కీలక పాత్రల్లో  నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌ టైన్‌మెంట్స్‌పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.  తాజాగా కన్నప్ప ప్రాజెక్ట్‌లోకి పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అడుగుపెట్టేశారు. ఈమేరకు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశారు.

ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా విష్ణు అధికారికంగా ప్రకటించడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్‌ కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు సమాచారం ఉంది.  

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయింది. దాదాపు షూటింగ్‌ కార్యక్రమం పూర్తి దశలో ఉన్న కన్నప్ప ఇదే ఏడాది విడుదల కానుంది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు. "కన్నప్ప"లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement