సీఎం విజయ్‌తో విజయ్‌ దేవరకొండ భేటి | Vijay Deverakonda Rashmika Mandanna Meet CM Thalapathy Vijay | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌తో విజయ్‌ దేవరకొండ భేటి

Oct 12 2026 9:27 PM | Updated on Oct 12 2026 9:34 PM

Vijay Deverakonda Rashmika Mandanna Meet CM Thalapathy Vijay

సినీ తారలు, రాజకీయ ప్రముఖుల మధ్య జరిగే భేటీలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఒక్క మీటింగ్‌తోనే ఫేవరెట్ అయిపోయారు!
‘దళపతి విజయ్‌తో గడిపిన క్షణాలు ఎంతో ప్రత్యేకం. రోజంతా బిజీగా ఉన్నప్పటికీ తమను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. జీవితం, పని, ప్రపంచానికి సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలతో పాటు విలువైన అనుభవాలను తమతో పంచుకున్నారు. ఒక్క సమావేశంతోనే విజయ్ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారు’ అని విజయ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

అక్టోబర్ 16న రణబాలిగా
పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన చిత్రం ‘రణబాలి’. గతంలో విజయ్‌తో ‘టాక్సీవాలా’ తెరకెక్కించిన రాహుల్‌ సంకృత్యాన్‌  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్రం రాక ముందు రాయలసీమలోని ఒక ప్రాంతంలో జరిగిన అమానవీయ సంఘటనలను ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

( ఇదీ చదవండి: ‘మండాడి’ తర్వాత సుహాస్‌ కొత్త సినిమా ఇదే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement