వరుణ్ తేజ్​- లావణ్య పెళ్లి షెడ్యూల్‌ ఇదే.. వేడుకలకు ఆమె దూరం | Varun Tej And Lavanya Tripathi Marriage On November 1st | Sakshi
Sakshi News home page

Varun Tej And Lavanya Tripathi Marriage: వరుణ్ తేజ్​- లావణ్య త్రిపాఠి పెళ్లి షెడ్యూల్‌ ఇదే.. వేడుకలకు ఆమె దూరం

Oct 29 2023 7:41 AM | Updated on Oct 29 2023 10:44 AM

Varun Tej And Lavanya Tripathi Marriage On November 1st - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్​- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి.  నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు.   తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్‌ చరణ్‌-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్​- లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో వెళ్లాడు. ఇలా రామ్‌ చరణ్‌, బన్నీ ఇద్దరూ వరుణ్‌ పెళ్లి ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ వేడుకకు మెగా-అల్లు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ నేడు ఇటలీ వెళ్లనున్నట్లు సమాచారం.

ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. నవంబర్‌ 1న పెళ్లి తర్వాత  ఇటలీ నుంచి  తిరిగి వచ్చాక హైదరాబాద్‌లో నవంబర్‌ 5న రిసెప్షన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు అందరూ ఆ సమయంలో హాజరు కానున్నారు. వరుణ్‌ వెడ్డింగ్‌ కార్డుకు సంబంధించిన వీడియోతో పాటు కొత్త జంటకు సంబంధిన వీడియోలు,ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. #Varunlav అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఇదిలా ఉండగా మెగాఫ్యామిలీలో ప్రధానమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి తల్లిగారు అయిన అంజనా దేవి మనవడి పెళ్లికి హాజరు కావడం లేదట. ప్రస్తుతం ఆమె ఆరోగ్య రిత్యా జర్నీ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించడంతో ఆమె ఇండియాలోనే ఉంటున్నారు. దీంతో వరుణ్‌- లావణ్యల పెళ్లిని ఇంటి నుంచే వీడియోలో చూసే విధంగా చిరంజీవి ప్లాన్‌ చేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement