రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్‌'.. ఆటో ఎక్కిన హీరో, హీరోయిన్! | Tollywood Hero Ram Pothineni Double Dose Promo Out Now, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Double Ismart Movie: హీరోయిన్‌తో ఆటోలో వచ్చిన రామ్... డబుల్‌ డోస్‌ ప్రోమో చూశారా?

Aug 6 2024 6:09 PM | Updated on Aug 6 2024 6:37 PM

Tollywood Hero Ram Pothineni Double Dose Promo Out Now

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని- పూరి జగన్నాధ్‌ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఆ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్‌ కాగా.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రామ్ సరసన ముంబయి భామ కావ్య థాపర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15 థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. దీనిలో భాగంగా గెటప్ శ్రీనుతో రామ్ పోతినేని, కావ్య థాపర్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఆటోలో వచ్చిన గెటప్ శ్రీను.. హీరోయిన్‌, హీరోతో కలిసి సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ ట్విటర్‌లో పంచుకున్నారు. డబుల్ ఇస్మార్ట్- డబుల్ డోస్ రైడ్‌ అంటూ ప్రోమోను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను బుధవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ‍ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement