మహేశ్ బాబు చిత్రంలో తమిళ స్టార్‌ హీరో.. క్లారిటీ! | Tamil star hero in Mahesh Babu Trivikram movie | Sakshi
Sakshi News home page

మహేశ్ బాబు చిత్రంలో తమిళ స్టార్‌ హీరో.. క్లారిటీ!

Feb 25 2022 12:32 AM | Updated on Feb 25 2022 8:29 AM

Tamil star hero in Mahesh Babu Trivikram movie - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు​, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​ కాంబినేషన్​ అంటే అభిమానులే కాదు, పేక్షకులు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన  'అతడు', 'ఖలేజ' వంటి చిత్రాల తరువాత హ్యాట్రిక్‌ చిత్రం కోసం వీరిద్దరూ రెడీ అవుతున్నారు. అయితే ఈ చిత్రంలో నెగిటీవ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర కోసం త్రివిక్రమ్ ప్రముక తమిళ హీరో విక్రమ్‌ను సంప్రదించినట్టుగా సోషల్‌ మీడియాలో అనేక కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విక్రమ్‌కు సంబంధించిన మేనేజర్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. దాంతో పాటు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని ఆయన తెలిపాడు. ఇక దీంతో మహేశ్ బాబు సినిమాలో విక్రమ్‌ లేనట్టేనని క్లారిటీ వచ్చేసింది. అయితే ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement