Sacrificing Star Sunisith Shocking Comments On Jr NTR, Prabhas Goes Viral - Sakshi
Sakshi News home page

Jr NTR, Prabhas: ప్రభాస్‌, తారక్‌పై నోరుపారేసుకున్న సునిశిత్‌.. ఈసారి ఏ రేంజ్‌లో వాయింపు ఉంటుందో!

May 17 2023 9:34 PM | Updated on May 18 2023 8:32 AM

Sunishith Comments on Jr NTR, Prabhas Goes Viral - Sakshi

బ్రహ్మానందంపై మర్డర్‌ కేసు ఉంది. జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌ నాకు చాలా క్లోజ్‌. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ పెద్ద హీరో. కానీ ఆయన పోర్న్‌ సి

సాక్రిఫైజింగ్‌ స్టార్‌ సునిశిత్‌.. ఈ మధ్య బాగా మార్మోగుతున్న పేరు. ఉపాసన గురించి నోటికొచ్చింది వాగడంతో ఉతికారేశారు రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌. అయినా అతడికి ఏది పడితే అది వాగేయడం కొత్తేమీ కాదు. ఆ హీరో కంటే నేనే తోపు, ఆ హీరో మీద కేసులున్నాయి, ఈ హీరోయిన్‌ నేను ప్రేమించుకున్నాం.. ఆ హీరోయిన్‌తో లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లా.. ఇలా అతడు చెప్పే కాకమ్మ కబుర్లకు లెక్కే లేదు. ఎప్పుడూ పగటి కలలు కంటూ కలల ప్రపంచంలోనే బతికేసే సునిశిత్‌కు చెర్రీ ఫ్యాన్స్‌ గట్టిగానే ధమ్కీ ఇచ్చారు.

ఇకపై ఏ హీరో జోలికి కూడా రాకూడదు అని వార్నింగ్‌ ఇస్తూనే ఖర్చులకు వాడుకోమని డబ్బులు కూడా ఇచ్చారు. తన్నులు తిన్న సునిశిత్‌ అలా మాట్లాడినందుకు సారీ కూడా చెప్పాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో అతడు ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల మీద నోరు పారేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అతడు మాట్లాడుతూ.. 'జూనియర్‌ ఎన్టీఆర్‌ పెద్ద హీరో. కానీ ఆయన పోర్న్‌ సినిమాలు చేశాడు. ఈ విషయం టాలీవుడ్‌లో సునిశిత్‌ అనే హీరో తప్ప ఎవరూ చెప్పరు!' అని చెప్పుకొచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలో కేవలం తారక్‌పైనే కాకుండా పలువురు సెలబ్రిటీల మీద కూడా ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. 'బ్రహ్మానందంపై మర్డర్‌ కేసు ఉంది. ప్రభాస్‌, మంచు విష్ణుల మీద రేప్‌ కేసులున్నాయి. హీరోయిజం చూపించి వాళ్లు పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు. మహేశ్‌బాబును డీఫేమ్‌ చేస్తున్నానని వాళ్లబ్బాయి గౌతమ్‌ నాతో గొడవపడ్డారు. మహేశ్‌బాబుతో ఫేషియల్‌ చేయించుకోవడానికి యూఎస్‌ వెళ్లాను, తెలుసా' అంటూ అదే ఇంటర్వ్యూలో  కారుకూతలు కూశాడు. ఈయన వ్యాఖ్యలు విన్న నెటిజన్లు అతడినలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా, ఓరి వారి.. మొన్ననే కదా కొట్టిర్రు, ఇంకా సిగ్గు రాలేదా? అని కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్‌, తారక్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈసారి మా చేతిలో అయిపోయాడు అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement