Shruti Haasan Comments On Dance In Snow Falls Without Coats - Sakshi
Sakshi News home page

Shruti Haasan: హీరోలకేమో జాకెట్స్.. మాకు కనీసం కోట్ కూడా ఇవ్వరు: శృతిహాసన్

Apr 9 2023 7:23 PM | Updated on Apr 10 2023 11:43 AM

Shruti Haasan Comments On Dance In Snow falls without Coats - Sakshi

తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఈ ఏడాదిలో సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డిలో నటించిన సంగతి తెలిసింగదే. తాజాగా కోలీవుడ్ భామ శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన  శృతిహాసన్ వాల్తేరు వీరయ్య సాంగ్‌పై కామెంట్స్ చేశారు.

శృతిహాసన్ మాట్లాడుతూ..'మంచులో డ్యాన్స్ చేయడం అంటే చాలా కష్టం. హీరోలు మాత్రం చలిని తట్టుకునేలా జాకెట్స్ వేసుకుంటారు.  కానీ మాకు  అలాంటివేమీ ఇవ్వరు. కనీసం కోట్, శాలువా కూడా ఇవ్వరు. మేము కేవలం శారీ, జాకెట్ ధరించి ఆ గడ్డ కట్టిన మంచులో డ్యాన్స్ చేయాలి. దయచేసి హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇటీవలే ఇలాంటి అనుభవం ఎదురైంది' అని చెప్పుకొచ్చారు. కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో ఓ సాంగ్‌ను పూర్తిగా మంచుకొండల్లో చిత్రీకరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement