Serial Actress Lahari 9th Month Baby Shower Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Actress Lahari: తొమ్మిదవ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్‌

Jul 30 2023 10:51 AM | Updated on Jul 30 2023 12:20 PM

Serial Actress Lahari 9th Month Baby Shower Photos Goes Viral - Sakshi

ఈ వేడుకలో లహరి ఎల్లో డ్రెస్‌లో మెరిసిపోయింది. దీనిపై రెడ్‌ కోట్‌ ధరించింది. ఆమె భర్త లహరికి మ్యాచ్‌ అయ్యేలా రెడ్‌ జాకెట్‌ ఉన్న బ్లూ డ్రెస్‌ ధరించాడు. ప్రస్తుతం లహరి సీమం

సీరియల్స్‌తో బాగా ఫేమస్‌ అయిన నటి లహరి. మొగలి రేకులు నుంచి గృహలక్ష్మి వరకు పలు సీరియల్స్‌లో భిన్నరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. అయితే ఇటీవల నటనకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది లహరి. తను గర్భం దాల్చడం వల్లే యాక్టింగ్‌కు విరామం పలికింది.

గత నెలలో లహరి సీమంతం వేడుకను ఇంటిసభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సీమంతానికి బుల్లితెర తారలు హాజరై కాబోయే తల్లిని మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం లహరికి తొమ్మిదవ నెల కావడంతో స్నేహితులంతా కలిసి మరోసారి సీమంతం ఫంక్షన్‌ చేశారు. ఈ వేడుకలో లహరి ఎల్లో డ్రెస్‌లో మెరిసిపోయింది. దీనిపై రెడ్‌ కోట్‌ ధరించింది. ఆమె భర్త లహరికి మ్యాచ్‌ అయ్యేలా రెడ్‌ జాకెట్‌ ఉన్న బ్లూ డ్రెస్‌ ధరించాడు. ప్రస్తుతం లహరి సీమంతం ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇకపోతే ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను  లహరి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. దుస్తులు, బ్యాగులు, బెడ్‌.. ఇలా అన్నింటినీ ముందుగానే సమకూర్చుకుంది. వీటికి సంబంధించిన వీడియోలను సైతం తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసింది. మరికొద్ది రోజుల్లో డెలివరీ ఉండటంతో లహరికి అభిమానులు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చదవండి: ప్రియుడి కోసం పేరు మార్చుకున్న నటి, పెళ్లయిపోయిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement