Samantha Shocking Comments About Heroine Remuneration - Sakshi
Sakshi News home page

రెమ్యునరేషన్‌పై సమంత ఘాటు వ్యాఖ్యలు

Mar 9 2021 1:45 PM | Updated on Mar 9 2021 5:31 PM

Samantha Speaks About Heroines Remuneration - Sakshi

దక్షిణాది చిత్రసీమలో హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్‌ విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరోలకు సమానంగా పోటీపడి నటించినా, పారితోషికం వరకు వచ్చేసరికి హీరోకు ఇచ్చిన దాంట్లో కనీసం సగం కూడా ఇవ్వరని గతంలో..

దక్షిణాది చిత్రసీమలో హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్‌ విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరోలకు సమానంగా పోటీపడి నటించినా, పారితోషికం వరకు వచ్చేసరికి హీరోకు ఇచ్చిన దాంట్లో కనీసం సగం కూడా ఇవ్వరని గతంలో చాలామంది హీరోయిన్లు బాహాటంగానే పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా నటి సమంత ఈ విషయంపై మాట్లాడారు. ఇండస్ర్టీలో టాప్‌ 3లో ఉన్న హీరోయిన్‌కు కనీసం టాప్‌ 20కూడా లేని హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్‌ కంటే తక్కువగానే ఇస్తారని చెప్పుకొచ్చింది.

'ఒకవేళ రెమ్యునరేషన్‌ పెంచితే ఆమె భారీగా  డిమాండ్‌ చేస్తుంది, అత్యాశకు పోతుంది అనే ముద్ర వేస్తారు. అదే హీరో అడిగితే మాత్రం పెద్దగా అభ్యంతరం చెప్పారు. పైగా అతను సక్సెస్‌లో ఉన్నాడని సమర్థిస్తారు. హీరోయిన్లు రెమ్యునరేషన్‌ ఎక్కువ అడిగితే అదేదో క్రైమ్‌లా చూస్తారు' అంటూ ఘాటుగా స్పందించింది. రానున్న రోజుల్లో అయినా హీరోలకు సమానంగా  పారితోషికం ఇచ్చే రోజులు రావాలని సమంత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సమంత నటించిన వెబ్ డ్రామా ది ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది.  తెలుగులో ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సమంత తమిళంలో ‘కాదు వాక్కుల రెండు కాదల్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు.

చదవండి : (వైరల్‌: సమంత అద్భుత స్టెప్పులు చూశారా)
(‘క్లైమాక్స్‌ చూసి అమ్మ కంటతడి పెట్టింది’)


 

Advertisement
 
Advertisement
Advertisement