చాలా అసహ్యంగా నటించా.. ఇ‍ప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత | Samantha Latest Speech Talked Her First Movie Acting | Sakshi
Sakshi News home page

Samantha: నా సినిమాలు ఇప్పుడు చూస్తే అలా అనిపిస్తోంది

Apr 20 2025 12:39 PM | Updated on Apr 20 2025 1:15 PM

Samantha Latest Speech Talked Her First Movie Acting

సమంత(Samantha) ఈ పేరు చెప్పగానే ఏ మాయ చేశావె తో పాటు చాలా సినిమాలు గుర్తొస్తాయి. తెలుగులో స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పలు కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంది. నిర్మాతగా మారి 'శుభం' అనే మూవీని విడుదలకు సిద్ధం చేసింది.

మే 9న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. నెల్లూరులోని ఓ కాలేజీలో తాజాగా ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో మాట్లాడిన సమంత.. తన తొలి చిత్రాల్లో చాలా ఘోరంగా యాక్టింగ్ చేశానని, అవి చూస్తున్నప్పుడల్లా సిగ్గేస్తుందని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: భరించలేని నొప్పితో ఆస్పత్రిలో చేరిన రష్మీ గౌతమ్‌..)

సమంత నటించిన తొలి చిత్రం 'ఏ మాయ చేశావె'(Ye Maaya Chesave). అయితే ఈ మూవీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇందులో తన యాక్టింగ్ తనకే నచ్చలేదని సమంత చెప్పడం మాత్రం ఆశ్చర్యకలిగించింది. ఇకపోతే సామ్ ప్రస్తుతం 'రక్త బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇది వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలున్నాయి.

ఏ మాయ చేశావె.. సమంత కెరీర్ లో చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది తనకు తొలి సినిమా. కలిసి నటించిన నాగచైతన్యని(Naga Chaitanya) కొన్నాళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాకపోతే మనస్పర్థల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. అయితేనేం చాలామందికి ఇప్పటికీ 'ఏ మాయ చేశావె' ఫేవరెట్ సినిమానే కావడం విశేషం.

(ఇదీ చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్‌)

Advertisement
 
Advertisement
Advertisement