'యానిమల్' వైబ్‌లోనే ఆర్జీవీ.. డైరెక్టర్ గురించి అలాంటి ట్వీట్ | RGV Another Tweet On Animal Director Sandeep Reddy Vanga | Sakshi
Sakshi News home page

Animal Movie RGV: సందీప్‌ని మర్చిపోలేకపోతున్న వర్మ.. ఆ రెండు థెరపీలు చేశాడంటూ!

Dec 4 2023 7:16 PM | Updated on Dec 4 2023 7:55 PM

RGV Another Tweet On Animal Director Sandeep Reddy Vanga - Sakshi

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. 'యానిమల్' సినిమా నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికే చిత్రాన్ని, డైరెక్టర్ సందీప్‌ని ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశాడు. ఇప్పుడు మరోసారి క్రేజీ కామెంట్స్ చేశాడు. అయితే ఈసారి దర్శకుడిని మెచ్చుకుంటూనే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ, ప్రేక్షకులపై కౌంటర్ వేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)

'అర్జున్ రెడ్డి' మూవీతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత ఇదే సినిమాని హిందీలో 'కబీర్ సింగ్'గా తీశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' మూవీ తీశాడు. ఈ డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం వందల కోట్లు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఆర్జీవీ.. సందీప్ గురించి క్రేజీ ట్వీట్ చేశాడు.

'సందీప్ రెడ్డి వంగా.. నిజ జీవితంలో ఫిజియోథెరపీ డాక్టర్. అయితే 'యానిమల్' సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి మెంటల్ థెరపీ చేశాడు. ప్రేక్షకులకు హిప్నోథెరపీ చేశాడు' అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్‪‌లో రాసుకొచ్చాడు. అయితే వర్మ.. ఈ ట్వీట్‌లో సందీప్‌ని మెచ్చుకుంటూనే ఇండస్ట్రీ, ప్రేక్షకులపై సెటైర్స్ వేయడం విశేషం.

(ఇదీ చదవండి: నేను మోసపోయానంటూ రైతుబిడ్డ ఫైర్.. కప్పు ఇచ్చేయండన్న అమర్!)

Advertisement
 
Advertisement
Advertisement