'చాలామందితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ'.. రెజీనా షాకింగ్ కామెంట్స్! | Regina Cassandra Shocking Comments About Relations In Tollywood | Sakshi
Sakshi News home page

Regina Cassandra: 'నేను ఒక సీరియల్ డేటర్'.. రెజీనా షాకింగ్ కామెంట్స్!

Sep 13 2024 11:35 AM | Updated on Sep 13 2024 12:07 PM

Regina Cassandra Shocking Comments About Relations In Tollywood

టాలీవుడ్‌ సినీ ప్రియులకు రెజీనా పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించింది.  ప్రస్తుతం ఉత్సవం మూవీతో మరోసారి టాలీవుడ్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు వచ్చింది.  దిలీప్‌ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన తాజా చిత్రం 'ఉత్సవం'. అర్జున్‌ సాయి దర్శకత్వం వహించిన ఈరోజే అంటే సెప్టెంబర్‌ 13న థియేటర్లలోకి వచ్చేసింది. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌పాటిల్‌ నిర్మించారు.

అయితే అంతకుముందు మూవీ ప్రమోషన్లలో భాగంగా రెజీనా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా రిలేషన్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను చాలామందితో రిలేషన్‌లో ఉన్నానని తెలిపింది. అయితే నాకు చాలా ప్రపోజల్స్‌ ఉన్నాయని.. ఈ విషయంలో నేను ఒక సీరియల్ డేటర్‌ అని చెప్పొచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్‌ చేశారు. అయితే ప్రస్తుతం వీటన్నింటికీ దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది రెజీనా.

(ఇది చదవండి: వ్యాపారవేత్తతో హీరోయిన్‌ 'రెజీనా' పెళ్లి ఫిక్స్‌)

అయితే గతంలో ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్‌ వినిపించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్‌ హీరో సందీప్ కిషన్‌తో రెజినా రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్‌ చెప్పడంతో అది కాస్తా ఆగిపోయింది. తాజా ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌ గురించి రెజీనా చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement