ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

Raveena Tandon Shares Unseen Throwback Photo Of Rishi Kapoor Wedding - Sakshi

పై ఫొటోలో పెళ్లి గెటప్‌లో ఉన్నది మరెవరో కాదు హిందీ స్టార్‌ జంట రిషి కపూర్‌, నీతూ సింగ్‌లు. మరి వీరి ముందు నిల్చుని కెమెరా వైపు గుడ్లప్పగించి చూస్తూ చిలకలా నవ్వుతున్న చిన్నారెవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన రవీనా టండన్‌. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఫొటోను షేర్‌ చేసింది. చింటూ అంకుల్‌(రిషి కపూర్‌) పెళ్లిలో ఇలా ఫొటోకు పోజిచ్చానని చెప్పుకొచ్చింది.

దీన్ని తన బయోగ్రఫీలో వాడుకుంటానని చెప్పాడని గుర్తు చేసుకుంది. ఈ ఫొటో తనకు ఎంతో అమూల్యమైనదని తెలిపింది. ఇక అందులో ఉన్నది హీరోయిన్‌ రవీనా టండన్‌ అని తెలియడంతో అభిమానులు అవాక్కవుతున్నారు. ఎంతో ముద్దొస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో 'సజన్‌ కీ బహూన్‌ మేన్‌' సినిమాలో రవీనా రిషితో కలిసి నటించిన సన్నివేశాలు చాలా బాగుంటాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా రిషి కపూర్‌, నీతూ సింగ్‌లు 1980 జనవరి 22న పెళ్లి చేసుకున్నారు. జిందా దిల్‌, ఖేల్‌ ఖేల్‌ మెయిన్‌, అమర్‌ అక్బర్‌ అండ్‌ ఆంటోనీ, డో డూనీ చార్‌ వంటి పలు చిత్రాల్లో వీరు కలిసి నటించారు. వీరికి రిద్ధిమా కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌ సంతానం. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్‌ గతేడాది ఏప్రిల్‌ 30న కన్నుమూశాడు.

చదవండి: పెళ్లికి ముందు అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ ప్లే బాయ్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top