ఫాంటసీ రెయిన్‌బో | Sakshi
Sakshi News home page

ఫాంటసీ రెయిన్‌బో

Published Mon, Jul 17 2023 6:11 AM

Rashmika Mandanna gears up for second schedule of Tamil-Telugu film Rainbow - Sakshi

హీరోయిన్‌ రష్మిక మందన లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తొలి చిత్రం ‘రెయిన్‌బో’. మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీతో శాంతరూబ¯Œ  దర్శకునిగా పరిచయమవుతున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌పై ఎస్‌ఆర్‌. ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌. ప్రభు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ముగిసింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘రెయిన్‌బో’. తమిళనాడు, కొడైకెనాల్‌ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అతిత్వరలోనే సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్, కెమెరా: కెఎం భాస్కరన్, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: తంగ ప్రభాకరన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అరవేంద్రరాజ్‌ భాస్కరన్‌.

Advertisement
Advertisement