Rudrudu Movie In OTT: అప్పుడే ఓటీటీలోకి లారెన్స్‌ 'రుద్రుడు' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..

Raghava Lawrence Rudrudu Movie Ott Release Date And Platform - Sakshi

రాఘవ లారెన్స్‌ తాజాగా నటించిన చిత్రం రుద్రుడు.‘మునీ-4’ తర్వాత దాదాపు ముడేళ్లు గ్యాప్‌ తీసుకుని లారెన్స్‌ ఈ సినిమాతో పలకరించారు. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లారెన్స్‌కు జోడీగా ప్రియా భ‌వానీ శంక‌ర్ న‌టించింది.

త‌మిళంలో రుద్ర‌న్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగులో రుద్రుడు పేరుతో ఏప్రిల్‌ 14న విడుదలైంది. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్‌ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.తాజాగా ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్దమయ్యింది. 

రుద్రుడు సినిమా డిజిట‌ల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ స‌న్ నెక్స్ట్ కొనుగోలు చేసింది. మే రెండో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top