దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఫౌజా నచ్చుతుంది: దర్శకుడు ప్రమోద్‌ కుమార్‌ | Pramod Kumar About Fouja: Bollywood | Sakshi
Sakshi News home page

దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఫౌజా నచ్చుతుంది: దర్శకుడు ప్రమోద్‌ కుమార్‌

Oct 28 2024 2:58 AM | Updated on Oct 28 2024 2:58 AM

Pramod Kumar About Fouja: Bollywood

‘‘డబ్బులిచ్చి బ్రాండెడ్‌ బట్టలు కొన్నంత సులువుగా ఆర్మీ యూనిఫామ్‌ని కొనలేం. కష్టంతో, ఇష్టంతో సాధించుకోవాలి. దేశభక్తి ఉంటేనే అది సాధించగలం. దేశం అంటే ప్రేమ, భక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ మా ‘ఫౌజా’ నచ్చుతుంది. త్వరలో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తాం’’ అని ప్రమోద్‌ కుమార్‌ పున్హానా అన్నారు. కార్తీక్‌ దమ్ము, పవన్‌ మల్హోత్రా, ఐశ్వర్యా సింగ్‌ ముఖ్య తారలుగా ప్రమోద్‌ కుమార్‌ పున్హానా దర్శకత్వంలో అజిత్‌ దాల్మియా నిర్మించిన హిందీ చిత్రం ‘ఫౌజా’.

ఇండియన్‌ ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ‘ఫౌజా’ని హైదరాబాద్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన వారిలో హీరో విజయ్‌ ధరన్‌ దాట్ల, ఏపీ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ దమ్ము మురళీమోహన్, హర్యానా ప్రిన్సిపల్‌ సెక్రటరీ డా. డి. సురేష్, కాంతి డి. సురేష్‌ తదితరులు ఉన్నారు.

 ‘‘ఫౌజీ’లాంటి చిత్రానికి భాషతో సంబంధం ఉండదు’’ అని ఈ సందర్భంగా హీరో కార్తీక్‌ చెప్పారు. ‘‘హిందీలో మా చిత్రానికి మంచి ఆదరణ లభించింది. తెలుగు ప్రేక్షకులూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని అజిత్‌ దాల్మియా అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement