అక్టోబరులో ఆరంభం | Prabhas and Hanu Raghavapudi Upcoming Movies Latest Update | Sakshi
Sakshi News home page

అక్టోబరులో ఆరంభం

Jul 1 2024 1:53 AM | Updated on Jul 1 2024 1:53 AM

Prabhas and  Hanu Raghavapudi Upcoming Movies Latest Update

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్  యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ మూవీ నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్న పేర్లు వినిపిస్తున్నాయి. వివేక్‌ సాగర్‌ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. వార్‌ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ లవ్‌స్టోరీ మూవీ ప్రీ ప్రోడక్షన్  వర్క్స్‌ చివరి దశకు చేరుకున్నాయి.

దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట హను రాఘవపూడి. ప్రస్తుతం వెకేషన్ లో భాగంగా ప్రభాస్‌ విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగొచ్చిన తర్వాత ‘రాజాసాబ్‌’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ  సినిమా పూర్తయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహించే సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌ పాల్గొంటారనే టాక్‌ వినిపిస్తోంది.

అయితే సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్‌’ అనే సినిమాకి కమిట్‌ అయ్యారు ప్రభాస్‌. ఈ సినిమా చిత్రీకరణ కూడా ఈ ఏడాది చివర్లోనే ప్రారంభం కానుందట. మరి.. హను రాఘవపూడి, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వాల్లోని సినిమాల చిత్రీకరణలో ప్రభాస్‌ ఏకకాలంలో పాల్గొంటారా? లేదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement