Pawan Kalyan Launches Suma Kanakala Jayamma Panchayathi Movie Trailer - Sakshi
Sakshi News home page

Jayamma Panchayathi Trailer: సుమ నోటి వెంట బూతు డైలాగ్‌.. షాకైన ఆడియెన్స్‌

Apr 16 2022 1:10 PM | Updated on Apr 16 2022 3:03 PM

Pawan Kalyan Launches Suma Jayamma Panchayathi Trailer - Sakshi

బుల్లితెర యాంకర్‌ సుమ కనకాల లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’.ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ప్రేక్షకుల్లో మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ విడుదల అయ్యింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరక్కెకిన ఈసినిమాలో సుమ జయమ్మ పాత్రలో అదరగొట్టినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె డైలాగ్‌ డెలీవరీ ఆకట్టుకుంటుంది.

అయితే తొలినుంచి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైన సుమ ట్రైలర్‌ చివర్లో మాత్రం బూతు డైలాగ్‌ చెప్పడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా చాలా కాలం త‌ర్వాత సుమ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా కావడంపై మంచి అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. విజ‌య్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బ‌ల‌గ ప్ర‌కాష్ నిర్మించారు. మే6న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement