Naga Chaitanya Ready For Second Marriage Rumours Goes Viral, Details Here - Sakshi
Sakshi News home page

Naga Chaitanya Second Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన నాగచైతన్య, మళ్లీ హీరోయిన్‌తోనేనా?

Apr 19 2022 1:43 PM | Updated on Apr 19 2022 3:06 PM

Naga Chaitanya Second Ready To Second Marriage News Goes Viral - Sakshi

గత ఏడాది అక్టోబర్‌లో నాగ చైతన్య, సమంత వీడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు వీరి విడాకుల ఇష్యూపై సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంటే.. ఇప్పుడు నాగచైతన్యకు రెండో పెళ్లి అనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాదిలోనే చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని దాని సారాంశం.

చైతన్యకు, అఖిల్.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేయాలని నాగార్జున డిసైడ్ అయ్యారట. అఖిల్‌ కోసం అమ్మాయిని వెతికే పనిలో నాగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాగచైతన్య  ఓ హీరోయిన్ తో మళ్లీ లవ్ లో పడినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం నాగ్‌ వరకు వెళ్లిందట. చైతూ తన లవ్ను కన్ ఫామ్ చేసేస్తే అఖిల్‌తో పాటు అతనికి కూడా పెళ్లి చేసేస్తాను అని నాగార్జున అంటున్నారని గాసిప్‌ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.

అయితే ఇవి కేవలం రూమర్స్‌ మాత్రమేననని అక్కినేని ఫ్యామిలీ సన్నిహితంగా ఉండేవారు చెప్పుకొస్తున్నారు. నాగ చైతన్య , అఖిల్ ప్రస్తుతం తమ కెరీర్స్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారని, కాబట్టి ఈ రూమర్స్ ను లైట్ తీసుకోమంటున్నారు. బంగార్రాజు తర్వాత నాగ చైతన్య థ్యాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక అఖిల్ ప్రస్తుతం ‘ఏజెంట్’మూవీ చేస్తున్నాడు. ఆగస్ట్‌లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement