ఓటీటీలోకి యూత్‌ను మెప్పించిన 'మార్కెట్‌ మహాలక్ష్మీ' సినిమా | Market Mahalakshmi Movie Streaming OTT Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి యూత్‌ను మెప్పించిన 'మార్కెట్‌ మహాలక్ష్మీ' సినిమా

Jul 1 2024 7:16 PM | Updated on Jul 1 2024 7:57 PM

Market Mahalakshmi Movie Streaming OTT Date Locked

'కేరింత'ఫేమ్‌ పార్వతీశం హీరోగా నటించిన తాజా చిత్రం మార్కెట్‌ మహాలక్ష్మీ. వీఎస్ ముఖేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 19న థియేటర్‌లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయమయింది. బి2పి స్టూడియోస్ ద్వారా అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలలో మెప్పించారు. థియేటర్‌లో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

చిన్న సినిమాగా వచ్చిన మార్కెట్‌ మహాలక్ష్మీ థియటర్‌లలో ప్రేక్షకులను మెప్పించింది. హీరోయిన్‌కు మొదటి సినిమానే అయినా కూడా తన నటనతో యూత్‌ను ఆకట్టుకుందని ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓటీటీ ఆహాలో జులై 4న స్ట్రీమింగ్‌ కానుందని ఆ సంస్థ ప్రకటించింది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో పార్వ‌తీశం, మార్కెట్‌లో కూర‌గాయలు అమ్ముకునే పాత్రలో ప్రణీకాన్వికా తమ నటనతో మెప్పించారు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది..? కుమారుడి వల్ల కట్నం వస్తుందని ఆశించిన తండ్రిని ఎలా మెప్పించాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి పార్వతీశం ఎలాంటి స్కెచ్‌ వేశాడు..? వంటి అంశాలు బాగా కనెక్ట్‌ అవుతాయి. మహాలక్ష్మి కోసం సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement