చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్‌ హీరోయిన్‌ కూతురు | Kushboo And Sundar Daughter Avantika Entry Into Kollywood, Interesting Rumour Goes Viral | Sakshi
Sakshi News home page

చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్‌ హీరోయిన్‌ కూతురు

Apr 3 2025 7:18 AM | Updated on Apr 3 2025 9:55 AM

Kushboo And Sundar Daughter Avantika Enter Kollywood

సాధారణంగా సినీ కుటుంబాలకు చెందిన వారసులు చిత్ర పరిశ్రమంలోనే పనిచేయాలని కోరుకుంటుంటారు. ముందు వేరే వృత్తులకు సంబంధించిన చదువులను అభ్యసించిన‍ప్పటికీ చివరికి వారి పయనం మాత్రం సినిమానే అవుతుంది. అందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. కాగా కోలీవుడ్‌లో ప్రముఖ సినిమా జంటల్లో దర్శకుడు సుందర్‌ సి, నటి, నిర్మాత కుష్బూల జంట ఒకటి. వృత్తిపరంగా విజయ పథంలో దూసుకుపోతున్న ఈ జంట 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ముచ్చటైన జంటకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు అందమైన కూతుర్లు ఉన్నారు. 

వీరి పేరుతోనే అవ్నీ సినీ మ్యాక్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా విత్తనం ఒకటైతే మొక్క మరొకటి అవుతుందా? అనే సామెత మాదరి దర్శకుడు సుందర్‌ సి, నటి కుష్బూ వారసులు కూడా వారి బాటలోనే నడుస్తారనిపిస్తోంది. ఎందుకంటే సుందర్‌ సి, కుష్బూ దంపతుల కుమార్తెలు అవంతిక, ఆనందిత ఇప్పుడు చదువులు పూర్తి చేసుకున్నారు.  వీరిలో అవంతిక అచ్చు తన తల్లి కుష్బూ రూపురేఖలనే కలిగి ఉండడంలో అతిశయోక్తి కాదు.. అవంతికను చూస్తుంటే చిన్ననాటి కుష్బూనే స్మరణకు వస్తారు. 

అవంతిక తాజాగా ప్రత్యేకంగా ఫొటోషూట్‌లో పాల్గొంది.  ఎంతో గ్లామర్‌గా ఉన్న ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. తెరపైకి కుష్బూ వారసురాలు రెడీ అంటూ కామెంట్స్‌ వెల్లువెత్తుతున్నాయి. తండ్రి ప్రముఖ దర్శకుడు. తల్లి సంచలన నటి, నిర్మాత. వారికి తోడు సమ్మోహన రూపంతో కనిపించే అవంతికకు కథానాయకి కావడానికి ఇంతకంటే మరేం కావాలి. హీరోయిన్‌గా ఈ క్యూట్‌ గర్ల్‌ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement