‘కోటబొమ్మాలి పిఎస్’లో శ్రీకాకుళం ఫోక్‌ సాంగ్‌ | Kota Bommali PS starringr First Single,A Sriakulam Mass Folklore On September 11th | Sakshi
Sakshi News home page

‘కోటబొమ్మాలి పిఎస్’లో శ్రీకాకుళం ఫోక్‌ సాంగ్‌

Sep 8 2023 3:44 PM | Updated on Sep 8 2023 3:44 PM

Kota Bommali PS starringr First Single,A Sriakulam Mass Folklore On September 11th - Sakshi

తెలుగు సినిమాలను నిర్మించడంతో పాటు పర భాష చిత్రాలను తెలుగులో రిలీజ్‌ చేస్తూ దూసుకెళ్తోంది ప్రముఖ నిర్మాణ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్‌-2. ఇప్పటికే పలు కోలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలను తెలుగులో విడుదల చేసింది. తాజాగా మలయాళ బ్లాక్‌ బస్టర్‌  నాయాట్టు చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తోంది.కోట బొమ్మాళి పిఎస్ పేరుతో తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించగా, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు కోట బొమ్మాళి PS మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. మాస్సీ శ్రీకాకుళం ఫోక్లోర్ ఫస్ట్ సింగిల్  సెప్టెంబర్ 11న విడుదలవుతుందని ఈరోజు  ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో ఈ అప్డేట్ అందించారు. పూర్తిస్థాయి ఫోక్ సాంగ్ తో రానున్న ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుందని అన్నారు దర్శకర్మాతలు. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న  తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement