Kiara Advani Wants to Pregnant, The Reason Is Here - Sakshi
Sakshi News home page

Kiara Advani: నాకు గర్భవతిని అవాలని ఉంది.. మరోసారి వైరల్‌గా మారిన హీరోయిన్‌ కోరిక

Jul 30 2023 9:18 AM | Updated on Jul 30 2023 11:47 AM

Kiara Advani Wants to Pregnant, The Reason Is Here - Sakshi

గత నెలలో ఈమె పొట్ట కాస్త పెద్దదిగా కనిపించడంతో ప్రెగ్నెంటా? అని కామెంట్లు చేశారు. అయితే తర్వాత మళ్లీ నాజూకుగా కనిపించడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది. కానీ కి

భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది హీరోయిన్‌ కియారా అద్వానీ. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంటున్న ఈమె ప్రస్తుతం రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ మూవీలో, హృతిక్‌ రోషన్‌ వార్‌ 2లో నటిస్తోంది. కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలో ప్రియుడు, బాలీవుడ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రాను పెళ్లాడింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో వీరి వివాహం జరిగింది. గత నెలలో ఈమె పొట్ట కాస్త పెద్దదిగా కనిపించడంతో ప్రెగ్నెంటా? అని కామెంట్లు చేశారు. అయితే తర్వాత మళ్లీ నాజూకుగా కనిపించడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది. కానీ కియారాకు ప్రెగ్నెంట్‌ అవ్వాలని ఎప్పటినుంచో ఉంది. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

2019లో వచ్చిన గుడ్‌ న్యూస్‌ సినిమా రిలీజ్‌ సమయంలో ఆమె మాట్లాడుతూ తనకు ప్రెగ్నెంట్‌ కావాలని ఉందని చెప్పింది. ఆ సమయంలో తనకు నచ్చింది తినొచ్చని, అడ్డు చెప్పేవారే ఉండరని అభిప్రాయపడింది. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ఎవరైనా సరే కానీ ఆరోగ్యంగా ఉంటే అంతే చాలంది. తాజాగా ఈ వ్యాఖ్యలు ఫిల్మీదునియాలో మరోసారి వైరల్‌గా మారాయి. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి తన సినిమాలన్నీ పూర్తి చేసి త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్తుందేమో చూడాలంటున్నారు అభిమానులు.

చదవండి: రెండో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి!
నేను ఆ ఇద్దరికి మాత్రమే భయపడతాను: రజనీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement