వస్తున్నాం! | Keeda Cola Teaser Release | Sakshi
Sakshi News home page

వస్తున్నాం!

Jun 29 2023 4:09 AM | Updated on Jun 29 2023 4:09 AM

Keeda Cola Teaser Release - Sakshi

‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల తర్వాత దర్శక–నటుడు తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజయ్, చైతన్య రావు మాదాడిలతో పాటు తరుణ్‌ భాస్కర్‌ కూడా ఓ లీడ్‌ రోల్‌ చేశారు. కె. వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్‌ కౌశిక్, శ్రీ పాద్‌ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు.

వినోదాత్మక పాత్రలో బ్రహ్మానందం, లోకల్‌ డాన్‌గా తరుణ్‌ భాస్కర్‌ కనిపిస్తారు. సినిమా షూటింగ్‌ పూర్తయింది. బుధవారం టీజర్‌  రిలీజ్‌ చేశారు. ఏంట్రా అది (బ్రహ్మానందం), గ్రేప్స్‌.. ఏమో (మరో పాత్రధారి).. గ్రేప్‌.. గ్రే΄్సా... ఎలా బతికావురా ఇన్నాళ్లు నువ్వు...(బ్రహ్మానందం), నువ్వు బతుకుతా లేవా..అట్లనే... (మరో పాత్రధారి) అనే డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి. అలాగే టీజర్‌ చివర్లో ‘శ్వాస మీద ధ్యాస.. వస్తున్నాం’ అని కూడా కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement