Nandamuri Kalyan Ram Amigos Is Now Streaming On This OTT Platform - Sakshi
Sakshi News home page

Amigos : ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్‌ రామ్‌ అమిగోస్‌,స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Apr 1 2023 11:35 AM | Updated on Apr 1 2023 12:00 PM

Kalyan Ram Amigos Is Now Streaming On This Ott Platform - Sakshi

కల్యాణ్‌ రామ్‌ నటించిన తాజా చిత్రం అమిగోస్‌ ఇటీవలె ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో రాజేందర్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆషిక రంగనాథ్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. బింబిసార లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత కల్యాణ్‌రామ్‌ నటించిన సినిమా కావడంతో రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం ఆశించిన ‍స్థాయిలో విజయం సాధించలేదు.

కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ బాగున్నా, కథ, ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్‌ అయ్యిందనే చెప్పాలి. ఫలితంగా డిజాస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ అమిగోస్ డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది.నేడు(ఏప్రిల్‌1)నుంచే ఈ సినిమా  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్‌లో మెప్పించలేకపోయిన అమిగోస్‌ ఓటీటీలో అలరిస్తుందేమో చూడాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement