సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా తెలుగు వర్షన్‌ | Kaatera Movie Telugu Version Streaming Now On This OTT | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా తెలుగు వర్షన్‌

Apr 14 2024 4:01 PM | Updated on Apr 14 2024 4:39 PM

Kaatera Movie Telugu Version Streaming Now OTT - Sakshi

క‌న్న‌డలో గతేడాది రిలీజ్‌ అయిన కాటేరా  బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ కొట్టింది. దర్శ‌న్ హీరోగా న‌టించిన ఈ యాక్ష‌న్ సినిమా ప్రభాస్‌ సలార్‌తో పోటీ పడి రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వర్షన్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. తాజాగా తెలుగు వర్షన్‌ ఓటీటీలోకి వచ్చేసింది.

కేజీఎఫ్‌ సినిమాకు పోటీగా కాటేరా సినిమాను నిర్మించారని క‌న్న‌డ‌నాట‌ భారీగా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో కేజీఎఫ్ రికార్డుల‌ను కాటేరా బీట్ చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా కాటేరా చిత్రాన్ని ద‌ర్శ‌కుడు త‌రుణ్ సుధీర్  తెర‌కెక్కించాడు. తాజాగా తెలుగుతో పాటు త‌మిళ వెర్ష‌న్‌ జీ5 అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఆదివారం నుంచి కాటేరా చిత్రాన్ని జీ5 విడుదల చేసింది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఐదు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి మేకర్స్‌ తీసుకొచ్చారు.

కాటేరా సినిమాలో దర్శన్‌ సరసన ఆరాధ‌న రామ్ హీరోయిన్‌గా మెప్పించింది. సీనియ‌ర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధ‌న రామ్ కాటేరాతోనే సాండ‌ల్‌వుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సాధారణ కథనే అయినప్పటికీ కన్నడ ఆడియెన్స్‌కి ఎక్కేసింది. మరీ తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం రీచ్‌ అవుతుందో చూడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement