Jabardasth Varsha Give Hints on Bigg Boss Telugu Season 7 Entry - Sakshi
Sakshi News home page

Varsha: డాక్టర్‌ కాళ్లు పట్టుకుని బతికించమని ఏడ్చా.. రెండు రోజులు వాష్‌రూమ్‌ బయటే నిద్ర..

Jul 23 2023 12:32 PM | Updated on Sep 2 2023 2:32 PM

Jabardasth Varsha Give Hints on Bigg Boss 7 Telugu Entry - Sakshi

బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టింది.. బతకడం కష్టం అన్నారు. డాక్టర్‌ కాలు పట్టుకుని ఏడ్చాను. ఎంత ఖర్చయినా సరే బతికించండి అని బతిమాలాను.

జబర్దస్త్‌ కామెడీషోతో పేరుప్రఖ్యాతలు సంపాదించింది వర్ష. అందంతో అలరిస్తూనే కామెడీ స్కిట్లతో నవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌ 7వ సీజన్‌లో అడుగుపెట్టనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్‌ షోలో తన ఎంట్రీపై స్పందించింది వర్ష. 'నాకు సినిమా ఛాన్సులు వచ్చాయి. ఒక స్పెషల్‌ సాంగ్‌ చేసే ఆఫర్‌ కూడా వచ్చింది. కానీ బుల్లితెరను వదలడం ఇష్టం లేక అక్కడికి వెళ్లలేదు.

త్వరలో పెద్ద షోలో ఎంట్రీ ఇవ్వబోతున్నా
అయితే ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను. కానీ హీరోయిన్‌గా చేయాలన్న ఆశ లేదు. అక్క, వదిన, ఫ్రెండ్‌.. ఇలాంటి రోల్స్‌ మాత్రమే చేస్తాను. ఇకపోతే త్వరలో నేను ఓ పెద్ద షోకి వెళ్తున్నాను.. ఏం చదువుకున్నాను? వంటి విషయాలను అక్కడే రివీల్‌ చేస్తాను. ఇప్పటికే నాకు చెక్కులు కూడా పంపించేశారు' అంటూ పరోక్షంగా బిగ్‌బాస్‌ ఎంట్రీ గురించి హింట్లు వదిలింది వర్ష.

అన్నయ్యను స్కూటీతో ఢీ కొట్టారు
తన జీవితంలో ఎంతగానో బాధపడ్డ సందర్భం గురించి చెప్తూ.. 'నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. రెండేళ్లక్రితం నేను సంక్రాంతికి ఊరెళ్లాను. అప్పుడు అమ్మ ఫోన్‌ చేసి మా చిన్న అన్నయ్యకు యాక్సిడెంట్‌ అయిందని, త్వరగా రా అని చెప్పింది. మా అన్నయ్యను స్కూటీతో గుద్దారు. అది చాలా చిన్న యాక్సిడెంట్‌ అనుకున్నాను. తీరా ఆస్పత్రికి వెళ్లాక తన బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టింది.. బతకడం కష్టం అన్నారు. డాక్టర్‌ కాలు పట్టుకుని ఏడ్చాను. ఎంత ఖర్చయినా సరే బతికించండి అని బతిమాలాను.

రెండు రోజులు వాష్‌రూమ్‌ బయటే నిద్ర
అన్నయ్య కండీషన్‌ నాకు మాత్రమే తెలుసు. ఇంట్లో ఎవరికి చెప్పినా వాళ్లు తట్టుకోలేరు. అందుకే ఆ టెన్షన్‌ అంతా నేనే భరించాను. రెండు రోజులు వాష్‌రూమ్‌ బయట పడుకున్నాను. ఆ తర్వాత రోజు అన్నయ్య మెదడులో రక్తం లీక్‌ అవుతుందని చెప్పడంతో భరించలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. ఇంతలో అంబులెన్స్‌లో సొమ్మసిల్లి పడిపోవడంతో సెలైన్స్‌ పెట్టి నాకు ట్రీట్‌మెంట్‌ చేశారు. ఆ తర్వాత అన్నయ్యకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఎందుకంటే అన్నయ్య నా పంచప్రాణాలు' అని చెప్పుకొచ్చింది వర్ష.

చదవండి: బిగ్‌బాస్‌ షో ఫేక్‌.. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు

Advertisement
 
Advertisement
Advertisement