'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు పెళ్లయిపోయిందా? భార్య ఎవరంటే? | Sakshi
Sakshi News home page

Prashanth Varma Wife: భార్యని పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ.. ఫొటోలు వైరల్

Published Mon, Jan 29 2024 1:10 PM

Hanuman Director Prashanth Varma Wife Details - Sakshi

సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 'హనుమాన్'.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే ఇంకా ఊపు తగ్గట్లేదు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో చిత్రబృందంలోని ప్రతి ఒక్కరూ చాలా ఆనందంతో కనిపించారు. అయితే ఇదే వేడుకలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన భార్య గురించి చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశాడు.

ప్రశాంత్ వర్మ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. పలు షార్ట్ ఫిల్మ్స్‌తో నిరూపించుకున్న ఇతడు.. హీరో నాని నిర్మించిన 'అ!' మూవీతో దర్శకుడిగా మారాడు. తొలి చిత్రంతోనే విషయమున్నుడని ప్రూవ్ చేసుకున్నాడు. దీని తర్వాత 'కల్కి', 'జాంబీరెడ్డి' లాంటి చిత్రాలతో మనోడిలో విషముందని అందరూ అనుకునేలా చేశాడు. ఇక 'హనుమాన్'తో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని షేక్ చేసి పడేస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

ప్రశాంత్ వర్మని చూస్తే యంగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో అతడు ఇంకా సింగిల్ ఏమోనని అనుకున్నారు. కానీ నాలుగేళ్ల క్రితమే సుకన్య అనే అమ్మాయిని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. అంటే లాక్‌డౌన్ టైంలో పెళ్లి అయిపోవడం, అప్పటికి ఇతడు చిన్న డైరెక్టర్ కావడంతో ఎవరికీ తెలీదు. తాజాగా 'హనుమాన్' సక్సెస్ ఈవెంట్‌లో స్పీచ్ మొదలుపెట్టడమే.. తనకు అండగా నిలిచిన భార్యకు థ్యాంక్స్ చెప్పడంతో షురూ చేశాడు. అలా ప్రశాంత వర్మకు పెళ్లయిపోయిందని, అందమైన భార్య ఉందని అందరికీ తెలిసింది. 

పాలకొల్లుకు చెందిన ప్రశాంత్ వర్మ.. పెద్దల కుదిర్చిన సంబంధంతోనే సుకన్యని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు తప్పితే ఈమె గురించి పెద్దగా విషయాలేం బయటకు రాలేదు.

(ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్)

Advertisement
 
Advertisement
 
Advertisement