Gangubai Kathiawadi Movie OTT Release Date Confirmed, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Gangubai Kathiawadi OTT Release: వారం రోజుల్లో ఓటీటీలో గంగూబాయ్‌ కతియావాడి

Apr 20 2022 2:29 PM | Updated on Apr 20 2022 3:14 PM

Gangubai Kathiawadi Official OTT Release Date Announced By Netflix - Sakshi

తక్కువ కాలంలోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అడుగు పెట్టనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సోషల్‌ మీడియాలో

ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్‌ చిత్రం గంగూబాయ్‌ కతియావాడి. మాఫియా క్వీన్‌ గంగూబాయ్‌ కతియావాడి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అజయ్‌ దేవగణ్‌, ఇమ్రాన్‌ హష్మి, హ్యూమా ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజైంది.

తక్కువ కాలంలోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అడుగు పెట్టనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సోషల్‌ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్‌ 26 నుంచి గంగూబాయ్‌ కతియావాడి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు వెల్లడించింది. థియేటర్‌లో సినిమా చూడటం మిస్‌ అయినా, మరోసారి గంగూబాయ్‌ కతియావాడి చూడాలనుకున్నా మంగళవారం(ఏప్రిల్‌ 26) వరకు వెయిట్‌ చేయాల్సిందే!

చదవండి: Ram Charan - Jawans: జవాన్లతో రామ్‌చరణ్‌ ఫొటోలు

ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్‌ ఇదిగో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement