ప్రపంచంలో అందమైన మహిళలు.. టాప్‌ టెన్‌లో బాలీవుడ్ నటి..! | Sakshi
Sakshi News home page

Deepika Padukone: ప్రపంచంలో అందమైన మహిళలు.. టాప్‌ టెన్‌లో బాలీవుడ్ నటి..!

Published Mon, Oct 17 2022 4:02 PM

Deepika Padukone Is only Indian in 10 most beautiful women in the world - Sakshi

బాలీవుడ్‌లో దీపికా పదుకొణే అంటే పరిచయం అక్కర్లేని పేరు. 2007లో కెరీర్ ప్రారంభించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన  ఉనికి చాటుకుంది.  తాజాగా ఆమె పేరు అరుదైన జాబితాలో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన పది అందమైన మహిళల లిస్ట్‌లో ఇండియా నుంచి ఆమెకు స్థానం లభించింది.  ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు దీపికా పదుకొణే.  

 'ది గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై' పేరుతో ఈ జాబితాను తాజాగా విడుదల చేశారు. ఈ లిస్ట్‌లో ఎంపికైన వారి గోల్డెన్ రేషియో వరుసగా బియాన్స్ – 92.44 శాతం, అరియానా గ్రాండే – 91.81 శాతం, టేలర్ స్విఫ్ట్ – 91.64శాతం, కిమ్ కర్దాషియాన్ – 91.28 శాతం, దీపికా పదుకొణే  91.22 శాతంగా వెల్లడించారు. జోడీ కమర్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళల జాబితాను తయారు చేసింది. 

 ప్రస్తుతం దీపిక పలు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె షారుఖ్‌తో కలిసి పఠాన్‌లో కనిపించనుంది. వార్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కె లో ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇవే కాకుండా అమెరికన్ కామెడీ చిత్రం ది ఇంటర్న్‌లో కనిపించనుంది.  హృతిక్ రోషన్‌,  అనిల్ కపూర్ కీలక పాత్రల్లో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఫైటర్ మూవీలో నటిస్తోంది.

Advertisement
Advertisement