Choreographer Terence Lewis Opened Up on Dating Rumours With Nora Fatehi - Sakshi
Sakshi News home page

Nora Fatehi: నోరా ఫతేహితో డేటింగ్‌పై స్పందించిన కొరియోగ్రాఫర్‌

May 4 2022 7:34 PM | Updated on May 4 2022 9:16 PM

Choreographer Terence Lewis Opened Up on Dating Rumours With Nora Fatehi - Sakshi

ఈ సీక్రెట్‌ను సీక్రెట్‌లాగే ఉంచితే బాగుంటుంది. కావాలంటే నేను మీకు కెమెరా ఆఫ్‌ చేశాక చెప్తాను. నాకు తెలిసి ఆన్‌స్క్రీన్‌పై మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందనుకుంటున్నాను. నిజంగానే ఆమె ఎనర్జీ, వైబ్‌ను ఇష్టపడతాను. తను డ్యాన్సర్‌ కాబట్టి ఆ విషయం తనకూ తెలుసు.

బాహుబలి, టెంపర్‌తో పాటు పలు బాలీవుడ్‌ చిత్రాల్లోని ఐటం సాంగ్స్‌లో ఆడిపాడింది నోరా ఫతేహి. మెరుపులాంటి స్టెప్పులు, అదరగొట్టే ఎక్స్‌ప్రెషన్‌తో ఎంతోమందిని బుట్టలో వేసుకుందీ బ్యూటీ. అయితే నోరా సింగిల్‌ కాదని ఓ కొరియోగ్రాఫర్‌తో ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. డ్యాన్స్‌ మాస్టర్‌ టెరెన్స్‌ లూయిస్‌తో డేటింగ్‌ చేస్తోందని ఫిల్మీదునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై టెరెన్స్‌ స్పందించాడు.

ఈ సీక్రెట్‌ను సీక్రెట్‌లాగే ఉంచితే బాగుంటుంది. కావాలంటే నేను మీకు కెమెరా ఆఫ్‌ చేశాక చెప్తాను. నాకు తెలిసి ఆన్‌స్క్రీన్‌పై మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందనుకుంటున్నాను. నిజంగానే ఆమె ఎనర్జీ, వైబ్‌ను ఇష్టపడతాను. తను డ్యాన్సర్‌ కాబట్టి ఆ విషయం తనకూ తెలుసు. తనది చాలా కష్టపడి పనిచేసే స్వభావం. ఇకపోతే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌ అని ఎప్పుడూ చెప్పను, కాకపోతే మా మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా నోరా పంజాబీ సింగర్‌ గురు రంధవతో కూడా డేటింగ్‌ చేస్తుందంటూ ఇటీవల కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నోరా ఫతేహి డ్యాన్స్‌ దీవానీ జూనియర్‌ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. హరిహర వీరమల్లులోనూ కథానాయికగా నటించనుందని ప్రచారం జరుగుతోంది.

చదవండి: ఓటీటీల్లోకి బీస్ట్‌, అప్పటి నుంచే స్ట్రీమింగ్‌

ఏడాదవుతున్నా ఇంకా తొలిరోజు గాయంలా నొప్పి నన్ను వెంటాడుతూనే ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement