ఆలియా భట్‌ లేటేస్ట్ మూవీ.. టీజర్ వచ్చేసింది! | Bollywood Actress Alia Bhatt Latest Movie Jigra Movie TEASER TRAILER out Now | Sakshi
Sakshi News home page

Alia Bhatt: దేవర రాకతో వాయిదా.. ఆలియా భట్‌ మూవీ టీజర్ చూశారా?

Sep 8 2024 11:46 AM | Updated on Sep 8 2024 1:49 PM

Bollywood Actress Alia Bhatt Latest Movie Jigra Movie TEASER TRAILER out Now

బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జిగ్రా. ఈ సినిమాకు వాసన్ బాలా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌, వయాకామ్18 స్టూడియోస్, ఎటర్నల్ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై నిర్మించారు.

ఈ మూవీ నిర్మాతల్లో ఆలియా భట్ ఒకరిగా ఉన్నారు. అలియా భట్ తొలిసారిగా 2022లో డార్లింగ్స్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆమె తన ప్రొడక్షన్ హౌస్ ఎటర్నల్ సన్‌షైన్ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం అక్టోబర్‌ 11 దసరాకు విడుదల కానుంది. మొదట ఈ మూవీని ఈనెల 27న రిలీజ్ చేయాలని భావించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్‌ దేవర మూవీ విడుదల ఉండడంతో నిర్మాతలు వాయిదా వేయాలని నిర్ణయించారు. దీంతో విజయదశమికి జిగ్రా థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement