హౌస్‌మేట్స్‌కు గౌతమ్‌ తల్లి గోరుముద్దలు.. ఏడ్చేసిన ప్రిన్స్‌ యావర్‌ | Bigg Boss Telugu 7: Gautham's Mother Step Into BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: తల్లిని చూసి చంటిపిల్లాడిలా ఏడ్చేసిన గౌతమ్‌.. అమ్మ ప్రేమ గుర్తొచ్చి ప్రిన్స్‌ కంటతడి..

Nov 8 2023 12:13 PM | Updated on Nov 8 2023 12:25 PM

Bigg Boss Telugu 7: Gautham's Mother Step Into BB House - Sakshi

అందరినీ దగ్గరకు తీసుకున్న ఆమె ఇంట్లో అందరికీ గోరుముద్దలు తినిపించింది. తల్లి ప్రేమను చూసి ప్రిన్స్‌ యావర్‌ ఎమోషనలయ్యాడు. దీంతో గౌతమ్‌ తల్లి.. నువ్వు కూడా నా

కంటెస్టెంట్ల మధ్య ఎంత రాగద్వేషాలు ఉన్నా ఫ్యామిలీ వీక్‌లో మాత్రం అవన్నీ పటాపంచలైపోతాయి. తమ కన్నవారిని, కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను.. ఇలా కుటుంబసభ్యులను చూసేసరికి హౌస్‌మేట్స్‌లో ఎమోషన్స్‌ కట్టలు తెంచుకుంటూ వస్తాయి. రోజూ కొట్టుకుంటూ కనిపించే కంటెస్టెంట్లు ఇలా ఒక్కసారిగా ఏడ్చేసరికి వారి అభిమానులు కూడా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సీజన్‌లోనూ జరిగేదే!

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో తాజాగా ఫ్యామిలీ వీక్‌ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్‌లో శివాజీ తనయుడు, అర్జున్‌ భార్య, అశ్విని తల్లి బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టారు. నేడు గౌతమ్‌ తల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు ప్రోమో వదిలారు. తల్లిని చూడగానే గౌతమ్‌ ఏడ్చేశాడు. అందరినీ దగ్గరకు తీసుకున్న ఆమె ఇంట్లో అందరికీ గోరుముద్దలు తినిపించింది. చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన ప్రిన్స్‌ యావర్‌ తల్లి ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో గౌతమ్‌ తల్లి.. నువ్వు కూడా నా కొడుకువే అంటూ అతడిని హత్తుకుంది. మరి హౌస్‌లోకి ఇంకా ఎవరెవరు వస్తారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్‌? ఈ నటి మాటల్లోనే ఆన్సర్‌ దొరికేసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement