వివాదంలో తెలుగు బిగ్‌బాస్‌ బ్యూటీ.. పవిత్రమైన ప్రదేశంలో ప్రియుడితో అలా! | Bigg Boss Contestant Priyanka Jain Viral Reel In Tirumala | Sakshi
Sakshi News home page

Priyanka Jain: వివాదంలో తెలుగు బిగ్‌బాస్‌ బ్యూటీ ప్రియాంక.. ప్రియుడితో కలిసి అలాంటి పని!

Nov 26 2024 8:16 PM | Updated on Nov 26 2024 8:28 PM

Bigg Boss Contestant Priyanka Jain Viral Reel In Tirumala

తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్‌-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్‌. బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సీజన్‌లో టాప్‌-5లో చోటు దక్కించుకుంది. అంతేకాదు  బుల్లితెర నటుడు శివకుమార్‌తో ప్రేమాయణం సాగిస్తోంది.

అయితే తన యూట్యూబ్ ఛానెల్ నెవర్ ఎండింగ్ టేల్స్ ద్వారా వీడియోలు పోస్ట్‌ చేస్తోన్నసంగతి తెలిసిందే. అలా చాలాసార్లు తన ప్రియుడితో ఫ్రాంక్ వీడియోలు చేసింది. అయితే అందులో తిరుమల అలిపిరి నడక మార్గంలోనూ ఓ ఫ్రాంక్ వీడియో చేశారు ప్రియాంకజైన్, శివకుమార్. దీంతో పవిత్రమైన నడకదారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. కేవలం వ్యూస్ కోసం కక్కుర్తిపడి తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశాయ అని నామస్మరణ చేయాల్సిన చోట వీళ్లకు రీల్స్ పిచ్చి ఏంటని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

‍అసలేం జరిగిందంటే..

తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక జైన్. చిరుత వచ్చిందని.. ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. దీన్ని.. తిరుపతి దారిలో మామీద చిరుత ఎటాక్? అంటూ షాకింగ్‌ అయిన ఫొటోలతో వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. కానీ చివరికీ చిరుత లేదు.. అంతా ఫ్రాంక్ అంటూ తమ పైత్యాన్ని ప్రదర్శించింది ప్రియాంక జైన్. పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి చిల్లర పనులేంటని నెటిజన్స్‌ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అయితే ఈ వీడియోను ప్రస్తుతం తన ఛానెల్‌ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

సీరియల్స్‌తోనే ఫేమస్..

జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది. గత కొన్నేళ్లుగా వీరద్దరు సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement