Bigg Boss 5 Telugu: Shanmukh Jaswanth Whopping Highest Weekly Remuneration - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఒక్క వారానికి షణ్ముఖ్‌ రెమ్యునరేషన్‌ ఎంతంటే..

Sep 8 2021 1:57 PM | Updated on Sep 8 2021 6:40 PM

Bigg Boss 5 Telugu: shanmukh jaswanth Whopping Highest Remuneration - Sakshi

shanmukh jaswanth Remuneration for Bigg Boss Telugu 5:షణ్ముఖ్‌ జస్వంత్‌.. యూట్యూబ్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం అవసరం లేని పేరు. మొదట్లో కామెడీ, డాన్స్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్‌.. ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’వెబ్‌సిరీస్‌తో బోలెడంత క్రేజ్‌ను సంపాదించుకున్నాడు.  యూట్యూబ్‌లో పది ఎపిసోడ్స్‌కు 80 మిలియన్స్‌ పైగా వ్యూస్‌ వచ్చిన ఈ వెబ్‌సిరీస్‌తో మనోడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. సోషల్‌ మీడియాలో షన్నూకి బాగానే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

ఈ నేపథ్యంలో గత మూడు సీజన్ల నుంచి అతడ్ని సంప్రదిస్తుండగా, ఈసారి బిగ్‌బాస్‌ ఆఫర్‌ను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌ సీజన్‌-5లో పదో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్‌ మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే కాస్త బిడియంగానే ఉంటున్నట్లు కనిపిస్తుంది. వీడియోలతో యూట్యూబ్‌ను షేక్‌ చేసే షన్నూ..హౌస్‌లో మాత్రం అంత ఎనర్జిటిక్‌గా ఉండలేకపోతున్నాడు.

'ఇంతమంది జనాల మధ్య తానెప్పుడూ లేనని, బయటికెళ్లి వీడియోలు చేసుకుంటా కానీ ఇంత ప్రెజర్‌ తట్టుకోలేను' అంటూ మొన్నటి ఎపిసోడ్‌లో షన్నూ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. ఇప్పుడున్న 19మంది కంటెస్టెంట్లలో ఎవరెవరికి ఎంత ఎంత రెమ్యురేషన్‌ ఇస్తారన్నదానిపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే హౌస్‌లోని మిగతావాళ్లతో పోలిస్తే ఈ  యూట్యూబ్‌ స్టార్‌కే అత్యంత రెమ్యునరేషన్‌ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అందరి కంటే ఎక్కువగా షణ్ముఖ్‌ వారానికి సుమారు రూ. 2-2.5లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సోషల్‌ మీడియాలో అతడికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్‌ అందరి కంటే ఎక్కువగా షణ్ముఖ్‌ జస్వంత్‌కే భారీగా మూటజెప్పుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement