ముచ్చటగా మూడు | Baby Fame Vaishnavi Chaitanya Upcoming Movies updates | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడు

Jan 14 2025 3:04 AM | Updated on Jan 14 2025 3:04 AM

Baby Fame  Vaishnavi Chaitanya Upcoming Movies updates

‘బేబీ’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు తెలుగు అమ్మాయి వైష్ణవీ చైతన్య. ప్రస్తుతం ‘డీజే టిల్లు’ ఫేమ్‌ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ‘జాక్‌’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. తాజాగా ఈ యంగ్‌ బ్యూటీ ముచ్చటగా మూడు సినిమాలకు సైన్‌ చేశారని సమాచారం.

అది కూడా తెలుగులో కాదు... తమిళంలో రెండు సినిమాలు, కన్నడంలో ఓ స్టార్‌ హీరో ఫిల్మ్‌లో హీరోయిన్‌గా వైష్ణవి అవకాశం దక్కించుకున్నారని తెలిసింది. అలానే తెలుగులోనూ సినిమాలు చేసేందుకు వైష్ణవి కథలు వింటున్నారు. ఇలా ఈ ఏడాది వైష్ణవీ చైతన్య ఫుల్‌ బిజీగా ఉంటారని ఊహించవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement