ఏఆర్‌.మురుగదాస్‌ కూతురి ఫంక్షన్‌.. రెట్రో పాటకు డ్యాన్స్‌ | AR Murugadoss And His Daughter Dance For Retro Song | Sakshi
Sakshi News home page

ఏఆర్‌.మురుగదాస్‌ కూతురి ఫంక్షన్‌.. రెట్రో పాటకు డ్యాన్స్‌

Jun 17 2025 7:19 AM | Updated on Jun 17 2025 9:35 AM

AR Murugadoss And His Daughter Dance For Retro Song

కోలీవుడ్‌ దర్శకుడు  ఏఆర్‌.మురుగదాస్‌ తనలోని మరో కోణాన్ని అభిమానులకు పరిచయం చేశాడు. తన కుటుంబంతో పాటు డ్యాన్స్‌ చేసి అందరినీ ఆనందపరిచాడు. తన కూతురు హర్షిత హాఫ్‌ శారీ వేడుకలో సూర్య రెట్రో సినిమాలోని  కన్నిమా అనే పాటకు మురుగదాస్‌, భార్య, కుమరుడు, కూతురు కలిసి వీర లెవల్‌లో డాన్స్‌ చేశారు. వీరి కుటుంబ డాన్స్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మురుగదాస్‌లోని ఈ యాంగిల్‌ను చూసి ప్రేక్షకులు ఆశ్యర్యపోతున్నారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది దర్శకులు నటులుగా మారుతున్న విషయం తెలిసిందే. మురుగదాస్‌ కూడా నటుడవుతారేమో అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

గజని, స్టాలిన్‌, సర్కార్‌, దర్బార్‌,స్పైడర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మురుగదాస్‌ రీసెంట్‌గా సికందర్‌ అనే బాలీవుడ్‌ సినిమాను తెరకెక్కించాడు. అయితే, ఆ చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో ఏఆర్‌.మురుగదాస్‌ మార్కెట్‌ డౌన్‌ అయ్యిందనే ప్రచారం జోరందుకుంది. కాగా ప్రస్తుతం ఈయన శివకార్తికేయన్‌ హీరోగా మదరాసి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రుక్మిణి వసంత్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తదుపరి ఏఆర్‌.మురుగదాస్‌ చేసే చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఇలాంటి సమయంలో ఆయన ఇంట్లో ఒక వేడుక జరిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement