కూతురి కోసం బన్నీ స్పెషల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్! | Allu Arjun Wishes On Her Daughter Allu Arha's 8th Birthday Special - Sakshi
Sakshi News home page

Allu Arjun: లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!

Published Tue, Nov 21 2023 1:53 PM | Last Updated on Tue, Nov 21 2023 2:41 PM

Allu Arjun Wishes On Her Daughter Allu Arha Birthday Special - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. 

అయితే సాధారణంగా సెలబ్రిటీల పిల్లల తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారు. ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ ఒక అడుగు ముందే ఎప్పుడు ఉంటుంది. అలాగే బన్నీకి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరిద్దరిలో అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. సమంత నటించిన శాకుంతలం చిత్రంలో మెరిసింది. భరతుడిగా నటించి సిల్వర్‌ స్క్రీన్‌పై రాజసాన్ని పండించి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇవాళ తన పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ తెలిపారు. తన ఇన్‌స్టాలో అల్లు అర్హతో ఉన్న ఫోటోను పంచుకున్నారు.

బన్నీ తన ఇన్‌స్టాలో రాస్తూ..' హ్యాపీ బర్త్‌ డే మై లిటిల్ ప్రిన్సెస్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు అర్హకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోస్ట్‌ చూసిన కల్యాణ్ దేవ్, గీతూ రాయల్, పీవీ సింధు బర్త్ డే విషెస్ తెలిపారు. కాగా.. అల్లు అర్హ.. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్రలో అర్హ కనిపించనున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement