నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్‌లో ఆర్ఆర్ఆర్ హీరోయిన్.. ఆ పవర్‌ఫుల్‌ రోల్‌ కోసమేనా? | Alia Bhatt In Kalki fame director Nag Ashwin in his female lead project | Sakshi
Sakshi News home page

Nag Ashwin: నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్‌లో ఆలియా భట్.. ఆ పవర్‌ఫుల్‌ రోల్‌ కోసమేనా?

Nov 10 2024 8:06 PM | Updated on Nov 10 2024 8:06 PM

Alia Bhatt In Kalki fame director Nag Ashwin in his female lead project

ఈ ఏడాది కల్కి మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. రెబల్ స్టార్‌ ప్రభాస్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇందులో అమితాబ్ బచ్చన్‌, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు.

అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత నాగ్ అశ్విన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మహానటితో సూపర్ హిట్ కొట్టిన నాగ్.. మరోసారి లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ పాత్రకు ఆలియానే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారని లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.

అయితే ఆలియా భట్‌ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్‌ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్  తర్వాత మరో భారీ పాన్-ఇండియా చిత్రంలో కనిపించనుంది. బాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్‌ రోల్స్‌కు ఆలియా భట్‌ పేరుగాంచింది. ఇటీవలే ఆమె లీడ్‌ రోల్‌లో నటించిన జిగ్రా మూవీ థియేటర్లలో సందడి చేసింది.

అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మూవీని వైజయంతీ ఫిల్మ్స్ బ్యానర్‌లోనే తెరకెక్కించనున్నారు.  2025 మధ్యలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా.. అలియా భట్ ప్రస్తుతం శర్వాయ్ వాఘ్‌తో కలిసి ఆల్ఫా చిత్రంలో నటిస్తోంది.

 

 

 



 

Advertisement
 
Advertisement
Advertisement